పదవీ విరమణ పొందిన అధికారులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్కారం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం విశేష సేవలందించిన ముగ్గురు పోలీసు అధికారులు మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా వారిని కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌష్ ఆలం ఘనంగా సన్మానించారు.పదవీ విరమణ పొందిన వారిలో సి.ఎస్.బి. ఎస్సై ఆర్. రవీందర్ రెడ్డి (42 ఏళ్లు), టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై ఎన్. భాస్కరచారి (42 ఏళ్లు), రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె. వెంకటేశ్వర్లు (35 ఏళ్లు) ఉన్నారు. వీరంతా తమ సేవా కాలంలో పోలీస్ శాఖకు అంకితభావంతో పనిచేశారు.ఈ సందర్భంగా కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమైన ఘట్టం.సవాళ్లతో కూడుకున్న పోలీస్ ఉద్యోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి పదవీ విరమణ పొందడం గర్వకారణం.కుటుంబ సభ్యుల సహకారం అమూల్యం అని అన్నారు. పదవీ విరమణ తర్వాత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.కమిషనర్ స్వయంగా పూలమాలలు వేసి, శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి అధికారులను సత్కరించారు వారి భవిష్యత్తు శుభవంతం కావాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, రిజర్వు ఇన్స్పెక్టర్ (సంక్షేమం) కిరణ్ కుమార్, కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై మామిడి సురేందర్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


