epaper
Monday, March 2, 2026
epaper

జ‌డ్పీ పీఠంపై రెడ్ల క‌న్ను

మానుకోట జ‌డ్పీపీఠంపై రెడ్ల క‌న్ను
జ‌న‌ర‌ల్ కావడంతో రేసులోకి ఓసీలు
గంగారం నుంచి బ‌రిలోకి య‌త్నాలు
కాంగ్రెస్ నుంచి రేసులోకి వేం న‌రేంద‌ర్‌రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ్‌రెడ్డి
పొలిటిక‌ల్ ఎంట్రీకి ఇదే స‌రైన స‌మ‌యామ‌ని ఆలోచ‌నే
జ‌డ్పీచైర్మ‌న్ జ‌న‌ర‌ల్ కావ‌డంతో మంచి ఆప్ష‌న్‌గా చూస్తున్న వేం
సీఎం కుటుంబానికి స‌న్నిహితుడిగా వెన్నం శ్రీకాంత్ రెడ్డికి పేరు
సీనియ‌ర్ రాజ‌కీయ‌ త‌న‌యుడిగా మ‌హ‌బూబాద్‌లో నూకల అభినవరెడ్డికి గుర్తింపు
అధిష్ఠానంలో పెద్ద‌ల‌తో ముగ్గురు నేత‌లు ట‌చ్‌లో..!

కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మ‌హ‌బూబాబాద్ జిల్లా చైర్మ‌న్ ప‌ద‌విపై రెడ్లు క‌న్నేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో గంగారం మండ‌లం జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. మిగ‌తావ‌న్నీ కూడా రిజ‌ర్వు కావ‌డంతో ఇప్పుడు గంగారంపై రెడ్ల క‌న్ను ప‌డింది. జ‌న‌ర‌ల్ స్థానం నుంచి పోటీ చేసి గెలిస్తే.. జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌విని చేజిక్కించుకోవ‌చ్చనే అభిప్రాయంతో ఉన్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా ప‌రిధిలో ఉన్న గంగారం మండ‌లం, ములుగు నియోజ‌క‌వ‌ర్గం కింద ఉంది. సీత‌క్క ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గంగారం మండ‌లం కాంగ్రెస్‌కు కంచుకోట‌గా మారింది. ఇక్క‌డి నుంచి పోటీ చేసే అభ్య‌ర్థి గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే అన్న‌ట్లుగా ఉండ‌నుంది. టికెట్ తెచ్చుకుంటే జ‌డ్పీటీసీ గెలుపు ఖాయ‌మనే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఆశ‌వ‌హులు..!

స్థానిక స‌మ‌రానికి ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ జారీ చేయ‌డంతో మ‌హ‌బూబాబాద్ జిల్లాలో రాజకీయ వేఢీ పెరిగింది. జ‌డ్పీ చైర్మ‌న్ జ‌న‌ర‌ల్ కావ‌డంతో.. ఇన్నాళ్లు రాజ‌కీయ అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్న రెడ్డి లీడ‌ర్ల క‌న్ను ఇప్పుడు జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌విపై ప‌డింది. జిల్లాలో ఏకైక జ‌న‌ర‌ల్ స్థానంగా ఉన్న గంగారం నుంచి బ‌రిలోకి దిగా చైర్మ‌న్ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు తీవ్ర‌త‌రం చేశారు. ముఖ్య‌మంత్రి స‌లహాదారు వేం న‌రేంద‌ర్‌రెడ్డి త‌న‌యుడు వేం భార్గవరెడ్డి ఇక్క‌డి నుంచి పోటీ చేయ‌డం దాదాపుగా ఖాయ‌మైన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కుటుంబానికి స‌న్నిహితుడిగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారంలో ఉన్న రెడ్యాల మాజీ స‌ర్పంచ్‌, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డి, దివంగ‌త నేత నూక‌ల న‌రేష్ రెడ్డి త‌న‌యుడు నూక‌ల అభిన‌వ్ రెడ్డి సైతం గంగారం నుంచి పోటీ చేసే ఆలోచ‌న‌ల్లో ఉన్న‌ట్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. వీరితోపాటు మ‌రికొంద‌రు ఆశావాహులు ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణ‌లు మొదలుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్‌, బీజేపీల నుంచి పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌పై స్ఫ‌ష్ట‌త రావాల్సి ఉంది.

సీత‌క్క మ‌ద్ద‌తే కీల‌కం..

గంగారం జ‌డ్పీటీసీ స్థానం నుంచి టికెట్ ద‌క్కాల‌న్నా.. గెల‌వాల‌న్న మంత్రి సీత‌క్క మ‌ద్ద‌తే ఆశ‌వ‌హులకు, అభ్య‌ర్థుల‌కు కీల‌కం కానుంది. ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డితో త‌న‌యుడు భార్గ‌వరెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీకి దాదాపుగా రూట్‌మ్యాప్ సిద్ధ‌మైంద‌న్న వాద‌న వినిపిస్తోంది.ఇదిలా ఉండ‌గా సీఎం కుటుంబానికి స‌న్నిహితుడిగా వెన్నం శ్రీకాంత్ రెడ్డికి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ యువ నేత‌గా జిల్లా రాజ‌కీయాల్లో మంచి పేరు ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబాబాద్‌, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో కో ఆర్డినేష‌న్ చేస్తూ అభ్య‌ర్థుల గెలుపున‌కు ప్ర‌య‌త్నం చేశార‌ని అధిష్టానం పెద్ద‌లు గుర్తించిన‌ట్లు స‌మాచారం. ఈమేర‌కు డీసీసీ రేసులోనూ ఇప్పుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి పేరు బ‌లంగా వినిపిస్తోంది. కాగా ఇప్పుడు జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకునే ల‌క్ష్యంతో గంగారం నుంచి జ‌డ్పీటీసీగా బ‌రిలోకి దిగే స‌మీక‌ర‌ణాలను ప‌రిశీలిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక సీనియ‌ర్ రాజ‌కీయ దివంగ‌త నేత‌ త‌న‌యుడిగా మ‌హ‌బూబాద్‌లో నూకల అభినవరెడ్డికి గుర్తింపు ఉంది. రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకునేందుకు జడ్పీటీసీ ఎన్నిక‌ల‌ను వినియోగించుకునే ప్ర‌య‌త్నాల‌ను ఆరంభించిన‌ట్లు స‌మాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img