కాకతీయ, ఇనుగుర్తి : నెల్లికుదురు మండలం రతి రామ్ తండాకు చెందిన ఎన్నారై గుగులోతు జగన్ తల్లిదండ్రులు కౌసల్య -లక్ష్మణ్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన జీకే ఎల్ ఫౌండేషన్ ద్వారా 50 కేజీల బ్లీచింగ్ పౌడర్ ను చిన్న నాగారం గ్రామానికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు చెడుపాక యాకయ్య పులి రమేశ్ లు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం కోసం బ్లీచింగ్ పౌడర్, వికలాంగులకు అవసరమైన పరికరాలు విద్యార్థులకు మెటీరియల్ జీకేఎల్ ఫౌండేషన్ అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గండు అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ గాయ జైపాల్ రెడ్డి, నాయకులు బైరు వెంకటయ్య, అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, చిన్న కుమార్ రెడ్డి, బిక్షం, ప్రగతి వెంకన్న, అంగన్వాడి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


