- ఎమ్మెల్యే మురళి నాయక్
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని రావిరాల యుపిఎస్ భవనాల నిర్మాణం చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. ఈనాడు రిలీఫ్ ఫండ్ ఆధ్వర్యంలో రూ కోటి ఆరు లక్షలతో నిర్మిస్తున్న నూతన భవనాల లకు ఎమ్మెల్యే, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఈవొ దక్షిణామూర్తి, ఈనాడు ప్రతినిధులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధిత గ్రామమైన రావిరాలకు మరో 100 ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
తెగిన చెరువు కట్ట త్వరలోనే నిర్మిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాయపులింగారెడ్డికి గ్రామస్తులతో పాటు ఎంఈఓ రాందాస్, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్, డీఈవో దక్షిణామూర్తి, మండల ప్రత్యేక అధికారి మరియన్న, తహసిల్దార్ సిహెచ్ నరేష్, ఎంఈఓ రాందాస్, ఎంపీడీవో సింగారపు కుమార్, ఎస్సై చిర్ర రమేష్ బాబు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


