కాకతీయ, నల్లబెల్లి : స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, మరోసారి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎంపీడీవో పసరగొండ రవి మాట్లాడుతూ చట్టాలను గౌరవిస్తూ బతుకమ్మ దసరా నిర్వహించే ప్రాంతాల్లో, గ్రామ కూడళ్లలో రాజకీయ పార్టీల బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించకూడదన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


