కాకతీయ, తెలంగాణ బ్యూరో : చైనా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. లంచం తీసుకున్నట్లు తేలడంతో ఓ మాజీ మంత్రికి ఏకంగా ఉరిశిక్ష విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రూ.337 కోట్ల అవినీతికి పాల్పడిన టాంగ్ రెన్జియాన్‌కు మరణశిక్ష విధిస్తూ కోట్లు సంచలన తీర్పు వెలువరించింది. గత కొన్నేళ్లుగా అవినీతిపై కఠిన యుద్ధం చేస్తున్న చైనా ప్రభుత్వం.. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులు, నేతలకు కఠిన శిక్షలు విధిస్తోంది.
రాజకీయ కార్యకలాపాలపై జీవితకాల నిషేధం
రూ.334 కోట్ల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో టాంగ్ రెన్‌జియాన్‌కు పై ఈ మేరకు చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలపై జీవితకాల నిషేధం విధిస్తూ.. జిలిన్ ప్రావిన్స్‌లోని కోర్టు తీర్పు చెప్పింది. ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని, లంచం సొత్తునూ స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగించాలని ఆదేశించింది. గతంలో చైనా వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన టాంగ్ రెన్జియాన్.. 38 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.337 కోట్లు) లంచాలు తీసుకున్నట్లు నేరం రుజువు అయింది. దీంతో కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ.. తాజాగా సంచలన తీర్పును ఇచ్చింది. అయితే ఉరిశిక్షను రెండేళ్ల పాటు వాయిదా వేసిన తర్వాత అమలు చేయనున్నారు.


