- ‘గ్రూప్స్’లో మెరిసిన ఎస్సై
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : టీజీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షలలో మహబూబాబాద్ టౌన్ ఎస్సై ప్రతిభ చూపి డీటీగా ఎంపికయ్యారు. టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కూటికంటి శివ గ్రూప్ 2లో 25వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఆయన స్వస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామం. 2019లో ఎస్సై పరీక్ష రాసి ఉద్యోగం సాధించి విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక గతంలో గ్రూప్ -4లో జూనియర్ అసిస్టెంట్ గా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా, రైల్వే ఎస్సైగా ఉద్యోగాలు సాధించడం విశేషం. కాగా, పట్టుదలతో గ్రూప్- 2లో 25వ ర్యాంకు సాధించడంపై ఆయన తల్లిదండ్రులు లక్ష్మీ-వెంకన్న, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.


