epaper
Saturday, November 15, 2025
epaper

టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి

టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి
గేమ్ ఛేంజర్ గా ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అపార అవకాశాలు
‘తైవాన్’ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం

కాక‌తీయ‌, హైద‌రాబాద్ (జూలై 25) : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శుక్రవారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తైవాన్ టెక్స్ టైల్ ఫెడరేషన్(టీటీఎఫ్) అధ్యక్షుడు జస్టిన్ వాంగ్ నేతృత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ‘స్వల్ప కాలంలోనే టెక్స్ టైల్ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎదిగింది. రాష్ట్ర పారిశ్రామిక జీఎస్ వీఏ 2024-25లో రూ.2.77 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో టెక్స్ టైల్ రంగం కీలక పాత్ర పోషించింది. దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి ఇక్కడే పండుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్(కేఎంటీపీ) గేమ్ ఛేంజర్ గా మారింద‌న్నారు. ప్రపంచ పటంలో తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తోంద‌ని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ‘కేఎంటీపీలో జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్ అన్నీ ఒకే చోట పూర్తి చేసేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామ‌న్నారు. టెక్స్ టైల్ దిగ్గజ కంపెనీలు యంగాన్, కైటెక్స్, గణేషా ఎకోస్పియర్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయ‌ని, రవాణా సౌకర్యాలపరంగా కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంద‌న్నారు. హైదరాబాద్ – నాగ్ పూర్ – విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ కు అనుసంధానంగా ఉంటుంది. ఫంక్షనల్ టెక్స్ టైల్స్, ఎకో – డైయింగ్, టెక్స్ టైల్ రీసైక్లింగ్ తదితర అంశాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయ‌న్నారు. ‘అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంద‌న్నారు. కస్టమైజ్డ్ ల్యాండ్ పార్సిల్స్, ప్లగ్ అండ్ ప్లే యూనిట్స్, నైపుణ్య మానవ వనరులు, సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం, భౌగోళిక పరిస్థితులు పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. టెక్స్ టైల్స్, టెక్నికల్ టైక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ అండ్ మానుఫ్యాక్చరింగ్(ఈఎస్ డీఎం), సస్టైనబుల్ మానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ అండ్ ఆర్ అండ్ డీ తదితర రంగాల్లో తైవాన్ కంపెనీలకు తెలంగాణ అనుకూలంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. తైవాన్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే ‘తెలంగాణ – తైవాన్ మాన్యుఫాక్చరింగ్ జోన్’, ప్రత్యేక టైక్స్ టైల్ క్లస్టర్ లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి టీటీఎఫ్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, రాష్ట్ర టైక్స్ టైల్స్ డైరెక్టర్ ధరణి, టీటీఎఫ్ సెక్షన్ చీఫ్ ఆర్థర్ చియాంగ్, తైవాన్ కు చెందిన టైనాన్ ఎంటర్ ప్రైజ్ కంపెనీ లిమిటెడ్, లీలీ గ్రూప్, ఆల్కేమీ తైవాన్ లిమిటెట్, సింగ్ యోంగ్ హో ఎంటర్ ప్రైజ్ కంపెనీ లిమిటెడ్, ఫార్ ఈస్టర్న్ న్యూ సెంచరీ కార్పోరేషన్, లిటిల్ కింగ్ గ్లోబల్ కంపెనీ లిమిటెడ్, యూ బంగ్ ఎంటర్ ప్రైజ్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు...

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..! రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు నోయెల్...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో..

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే!

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో...

ఎన్‌బీఎల్‌లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌పై త‌గ్గిన బీవోబీ

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) నైనిటాల్...

టెస్లా ఇండియా ఆప‌రేష‌న్ హెడ్‌గా శరద్ అగర్వాల్‌

భార‌త మార్కెట్లో విస్త‌ర‌ణ ల‌క్ష్యంగా కంపెనీ నిర్ణ‌యం కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్...

₹3,198 కోట్ల లాభాలు ఆర్జించిన అదాని ఎంటర్‌ప్రైజెస్

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్‌ : అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2026 ఆర్థిక సంవత్సరం...

హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ గోపీచంద్ క‌న్నుమూత‌

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్ : ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img