కాకతీయ, ఆత్మకూరు: సైడు కాలువలు లేక ఇండ్లలోకి వర్షపు నీరు వస్తున్నాయని కాలనీ వాసులు ఓదెల సదానందం అన్నారు. ఇటీవలే కురిసిన బారి వర్షాలకు జాతీయ రహదారి (163) అనుకోని ఉన్న ఆత్మకూరు పెద్ద చెరువుకు వెళ్లే ప్రధాన రహదారి పై వర్షపు నీరుతో సిసి రోడ్డు కనుమరుగయిందని కాలనీ వాసులు సదానందం తెలిపారు.
శనివారం కాలనీ వాసులు ఓదెల సదానందం మాట్లాడుతు వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందులు తప్పడంలేదని గతంలో కురిసిన బారి వర్షానికి రోడ్డు, కాళీ స్థలాలు చెరువులుగా మారుతాయని తెలిపారు. అధికారులకు చెప్పిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపడుచులు బతుకమ్మ ఆడడానికి బతుకమ్మను పట్టుకొని పెద్ద చెరువు దగ్గరకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి అని తెలిపారు.
గతంలో కూడా సైడు కాలువలు నిర్మించాలని పంచాయితీ కార్యదర్శికి, ఉన్నత అధికారులకు మొరపెట్టుకోవడం జరిగిందని ఇప్పటివరకు ఏ అధికారి పట్టించుకోలేదని అన్నారు. గురువారం కురిసిన బారి వర్షానికి రేవూరి లక్ష్మారెడ్డి, ఈరమ్మ ఇండ్లలోకి వర్షపు నీరు వెళ్లాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి రోడ్డు పై మరమత్తులు చేపించి సైడు కాలువలు నిర్మానించాలని ఉన్నత అధికారులను కోరారు..


