- ఆత్మకూరు మండలంలో..
కాకతీయ, ఆత్మకూరు : స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి వేడుకలను పద్మశాలి మండల అధ్యక్షుడు వెల్దే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి రాజకీయ నాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా విశేష కీర్తి పొంది చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీది అని తెలిపారు. గొప్ప ప్రజ్ఞాశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఉద్యమాలే జీవితంగా బతికి, తన సర్వస్వాన్ని ప్రజల కోసం ధారపోసిన ప్రగ్యాశాలి బాపూజీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పాపని రవీందర్, ఆత్మకూరు గ్రామ ప్రధాన కార్యదర్శి మార్త కేదారి, పద్మశాలి యూత్ అధ్యక్షులు మార్త రంజిత్ కుమార్, కొంపెల్లి రవి, కందకట్ల రాము, వి లక్ష్మణమూర్తి, వి సుదర్శన్, వెల్దె లక్ష్మణ్, వెంగళదాస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


