కాకతీయ, రామకృష్ణాపూర్ : క్షయ వ్యాధి నివారణే లక్ష్యంగా క్యాంప్ ఏర్పాటు చేసినట్లు మందమర్రి పీ.హెచ్.సీ వైద్యురాలు జాహ్నవి తెలిపారు. శనివారం పట్టణంలోని రెండో వార్డ్ తిలక్ నగర్లో ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పరీక్షల నిర్వహించినట్లు వైద్యురాలు జాహ్నవి తెలిపారు. క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మాజీ వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పిన్నింటి రఘునాథ్ రెడ్డి క్యాంప్ ను ప్రారంభించారు.


