కాకతీయ, పెద్దవంగర : స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసి ఈ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లే ప్రధాన అంశంగా ముందుకు వెళ్లాలని భావించి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని, పంచాయతీరాజ్ శాఖకు అప్పగించడంతో ఆ శాఖ రిజర్వేషన్ ఖరారు చేసింది. దాంతో అధికారులు రిజర్వేషన్ స్థానాలు ప్రకటించారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మండల వ్యాప్తంగా 26 గ్రామ పంచాయతీలు, 9 ఎంపీటీసీ ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆవుతాపురం గ్రామానికి ఎంపిటిసి బీసీ జనరల్, సర్పంచ్ జనరల్, గట్లకుంట గ్రామానికి ఎంపిటిసి బిసి మహిళ,సర్పంచ్ బిసి మహిళ,పోచంపల్లి గ్రామానికి ఎంపిటిసి బీసీ జనరల్, సర్పంచ్ ఎస్సీ జనరల్, వడ్డే కొత్తపల్లి గ్రామానికి ఎంపిటిసి జనరల్, సర్పంచ్ ఎస్సీ మహిళ, కోరిపల్లి గ్రామానికి ఎంపిటిసి ఎస్టీ జనరల్, సర్పంచ్ జనరల్, చిన్నవంగర గ్రామానికి ఎంపిటిసి ఎస్టీ మహిళ, సర్పంచ్ మహిళా జనరల్, బొమ్మకల్ గ్రామానికి ఎంపీటీసీ జనరల్ మహిళ, సర్పంచ్ బిసి జనరల్,
పెద్దవంగర గ్రామానికి ఎంపీటీసీ ఎస్సీ మహిళ,సర్పంచ్ ఓసి మహిళ, చిట్యాల గ్రామానికి ఎంపీటీసీ ఎస్సీ మహిళ సర్పంచ్ ఎస్సి జనరల్, రాజామాన్సింగ్ తండా గ్రామ సర్పంచ్ మహిళ, పడమటి తండా గ్రామ సర్పంచ్ మహిళ ,కాన్వాయ్ గూడెం గ్రామ సర్పంచ్ బీసీ జనరల్, బోత్తల తండ గ్రామ సర్పంచ్ జనరల్, పోచారం గ్రామ సర్పంచ్ బీసీ జనరల్, కండ్య తండ గ్రామ సర్పంచ్ ఎస్టి మహిళ, బావోజి తండా గ్రామసర్పంచ్ ఎస్టి జనరల్, బిసి తండ గ్రామ సర్పంచ్ ఎస్టి జనరల్, ఎల్బీ తండ గ్రామ సర్పంచ్ ఎస్టీ జనరల్, రామచంద్ర తండ గ్రామ సర్పంచ్ ఎస్టి జనరల్, ఉప్పరిగూడెం గ్రామ సర్పంచ్ జనరల్ మహిళ, రామోజీ తండా గ్రామ సర్పంచ్ ఎస్టీ మహిళ, టిక్యా తండ గ్రామ సర్పంచ్ ఎస్టి జనరల్, మోత్యా తండ గ్రామ సర్పంచ్ ఎస్టి మహిళ, జయరాం తండ గ్రామ సర్పంచ్ ఎస్టీ మహిళ,ఒంపు తండ గ్రామ సర్పంచ్ ఎస్టీ జనరల్, ఆర్ కె తండా గ్రామ సర్పంచ్ ఎస్టీ మహిళ గా కేటాయించారు.


