కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పరిధిలోని జడ్పీటీసీ స్థానాలకు 2025లో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ ద్వారా పాలనలో సామాజిక న్యాయం, సమానావకాశాలు కల్పించే ఉద్దేశంతో ఆధారంగా స్థానాలను వివిధ వర్గాలకు కేటాయించారు.
ములుగు జడ్పీ చైర్మన్ : ఎస్టీ వర్గానికి కేటాయించగా
ములుగు: ఎస్టీ (జనరల్),
వెంకటాపూర్: ఎస్సీ (జనరల్),
గోవిందరావుపేట: బీసీ(మహిళ),
తాడ్వాయి: బీసీ (జనరల్,)
కన్నాయి గూడెం : ఎస్టీ (జనరల్)
కమలాపురం: ఎస్సీ(మహిళ)
మంగపేట : ఓసి(మహిళ)
వెంకటాపురం : ఎస్సీ(మహిళ)
వాజేడు : బీసీ (జనరల్)
మల్లంపల్లి : బీసీ(మహిళ)
ఈ రిజర్వేషన్ల ద్వారా జిల్లా అన్ని వర్గాలకు, ముఖ్యంగా మహిళలు, దళితులు, ఆదివాసులకు రాజకీయంగా ముందుకు రావడానికి అవకాశాలు కల్పించారు. మొత్తం 10 స్థానాల్లో 4 మహిళలకు ప్రత్యేకంగా రిజర్వు చేయడం విశేషం. అలాగే, ఎస్టీ, ఎస్సీ, బీసీకి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ సామాజిక సమతుల్యతను కాపాడింది. పాలనలో ప్రాధాన్యత ఇలాంటి రిజర్వేషన్లు స్థానిక పరిపాలన వ్యవస్థలో కొత్త నాయకులను ప్రోత్సహించడమే కాకుండా, గ్రామీణ అభివృద్ధిలో సహకరించేలా చేస్తుంది. మండలాలు, గ్రామస్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.


