కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్తం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీటీ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీపీగా కొనసాగుతున్న సీవీ ఆనంద్..హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బదీల్లో భాగంగా ఆర్టీసీ ఎండీ పోస్టును నాగిరెడ్డికి కట్టబెట్టింది ప్రభుత్వం.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగ డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసింహాకు, ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతి లక్ష్మికి అదనపు బాధ్యతలు ఇవ్వగా, ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్టీజోన్-2 ఐజీగా డీఎస్ చౌహాన్, విపత్తు నిర్వహణ & ఫైర్ సర్వీసెస్ డీజీగా విక్రమ్‌సింగ్, పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు.
హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీగా శ్రీనివాసులు నియమితులయ్యారు. లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా తఫ్సీర్ ఇక్బాల్ బాధ్యతలు స్వీకరిస్తారు. సిద్దిపేట కమిషనర్‌గా ఎస్ఎం విజయ్‌కుమార్, నారాయణపేట ఎస్పీగా జీ. వినీత్, ఎల్బీనగర్ డీసీపీగా అనురాధ, రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్. శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీగా రితు రాజ్ నియమితులయ్యారు. అలాగే, ఏసీబీ జాయింట్ డైరెక్టర్లుగా సింధు శర్మ, సీహెచ్. ప్రవీణ్‌కుమార్‌లను నియమించారు. ఈ క్రమంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా రవి గుప్తా బదిలీ అయ్యారు.


