న్యాయవాదుల బార్ లైసెన్స్ రద్దు చేయాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్
కాకతీయ. హుస్నాబాద్ : సుప్రీంకోర్టు సీజే బీఆర్ గవాయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మురళీమోహన్ రావు, శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మురళీమోహన్ రావు, శ్రీకాంత్ బార్ లైసెన్స్ రద్దు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హుస్నాబాద్ కోర్టు ఆవరణలో వారు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అణగారిన వర్గాలలో ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అగ్రకుల దురాహంకారానికి నిదర్శనమని అన్నారు. నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కొమ్ముల రమేశ్, బోయిని సురేష్, జేరిపోతుల రవీందర్, కొంకటి శ్రీనివాస్, శ్రీదేవి, బానోత్ శ్రీనివాస్ నాయక్, సుంకే రాజశేఖర్, జేరిపోతుల కిరణ్, చింతకింది భాస్కర్, గర్రెపల్లి పర్షరాములు, సికా ప్రదీప్, బోయిని సదన్ మహారాజ్, బత్తుల అరుణ్ తేజ, అన్నబోయిన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


