epaper
Saturday, November 15, 2025
epaper

గిన్నీస్ రికార్డ్ బతుకమ్మను విజయవంతం చేయాలి

గిన్నీస్ రికార్డ్ బతుకమ్మను విజయవంతం చేయాలి

29న సరూర్‌న‌గర్ స్టేడియంలో నిర్వ‌హ‌ణ‌

పదివేల మంది మహిళలతో ఘ‌నంగా వేడుక‌లు

ప్రతి ఆడబిడ్డ పాల్గొని బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటాలి

గాంధీభవన్‌లో మహిళా సమావేశంలో మంత్రి సీతక్క

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఈనెల 29న సరూర్‌న‌గర్ స్టేడియంలో ప్రభుత్వం తలపెట్టిన గిన్నిస్ వరల్డ్ రికార్డు బతుకమ్మ వేడుక‌ల్లో మహిళలు అంతా పాల్గొనాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పదివేల మంది మహిళలతో బతుకమ్మను గిన్నిస్ రికార్డులుకు ఎక్కించే లక్ష్యంతో ప్రభుత్వ తరఫున వేడుక నిర్వహిస్తున్నామని, ప్రతి ఆడబిడ్డ పాల్గొని బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటాల‌ని కోరారు. గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథ‌కాలను సమగ్రంగా వివరించారు. ఈసంద‌ర్భంగా సీతక్క మాట్లాడుతూ..
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండగ తెలంగాణకు ప్రత్యేకమైన ఆస్తిత్వం అన్నారు. ఈ పండుగకు సంబంధించిన సాంప్రదాయాలను, ఆరోగ్య ప్రయోజనాలను, చెరువుల పరిరక్షణలో బతుకమ్మ పాత్రను వివరించారు. బతుకమ్మ ఆచారంలో చెరువులకు కృతజ్ఞతా భావం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. పల్లె జీవితానికి, మహిళల సంఘ సంబంధానికి బతుకమ్మ ఎంతో కీలకం అని, బతుకమ్మ వేడుకలను సాంప్రదాయ పద్ధతిలోనే జరుపుకోవాలని సూచించారు.

మ‌హిళ‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యం

అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రభుత్వం, ప్రత్యేకంగా మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాకుండా మహిళలను బస్సు ఓనర్లుగా చేస్తున్నామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం మహిళల అభయ హస్తం పొదుపు సొమ్మును, రూ.3500 కోట్ల రూపాయల వడ్డినీ ఎగ్గొటిందని గుర్తు చేశారు. అంతకు ముందు దివంగ‌త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఆయ‌న చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అదే సందర్భంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద మంత్రి సీతక్క నివాళి అర్పించారు. “జోహార్ చాకలి ఐలమ్మ” అని నినాదాలు చేస్తూ ఆమె త్యాగాలను కొనియాడారు.కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్, జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img