కాకతీయ, నేషనల్ డెస్క్: కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని మాయా సిల్క్ సారీస్ దుకాణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… ఈ నెల 20న మధ్యాహ్నం ఓ మహిళ ఆ దుకాణంలోకి ప్రవేశించింది. అక్కడున్న రూ.91,500 విలువైన 61 చీరల కట్టను దొంగిలించినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. వెంటనే షాప్ యజమాని ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా సిటీ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, ఆ తర్వాతి రోజు అదే మహిళ మళ్లీ ఆ దుకాణం వద్దకు రాగా, యజమాని, సిబ్బంది ఆమెపై దాడి చేశారు. నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టారు. కాళ్లతో తంతూ, అవమానకరంగా ప్రవర్తించారు. ఈ దాడి దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మహిళ దొంగతనం చేసినా కూడా ఇలా మానవత్వం లేని విధంగా ప్రవర్తించడం తగదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు ఇప్పటికే సదరు మహిళను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆమె వద్ద నుంచి దొంగిలించిన చీరలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మహిళపై దాడి చేసిన దుకాణ యజమాని, సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ಅವೆನ್ಯೂ ರಸ್ತೆಯಲ್ಲಿ ಹೇಳೋರು ಕೇಳೋರು ಯಾರು ಇಲ್ಲ ಅನ್ನೋ ಆಗಿದೆ.. ?
ಇವರದೇ ದರ್ಬಾರ್..
ಮಾರ್ವಾಡಿಗಳ ದಬ್ಬಾಳಿಕೆ ನೋಡಿ.. ?
ಬಾಬುಲಾಲ್ ಅನ್ನೋ ಇವನ ಮೇಲೆ ಕ್ರಮ ಆಗಲಿ..
ಈ ರೀತಿ ಅಸಹಾಯಕ ಹೆಣ್ಣುಮಗಳ ಮೇಲೆ ಶೂ ಕಾಲಲ್ಲಿ ಒದ್ದು ದೌರ್ಜನ್ಯ..
ಕೂಡಲೇ ಇವನ ಬಂಧನ ಆಗಲೇಬೇಕು..@BlrCityPolice @cottonpeteps pic.twitter.com/wolUNbM7Gi— ರೂಪೇಶ್ ರಾಜಣ್ಣ(RUPESH RAJANNA) (@rajanna_rupesh) September 25, 2025
ఈ సంఘటనపై కన్నడ అనుకూల కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “చీరలు దొంగిలించడం తప్పే కానీ, దాడి చేయడం ఇంకా పెద్ద తప్పు. చట్టం చేతుల్లో ఉన్నప్పుడు వ్యక్తులు ఇలా న్యాయం చేసుకోవడం సమాజానికి హానికరం” అని వారు మండిపడ్డారు. బెంగళూరు పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని వారు ఆరోపించారు.
సమాజంలో మహిళలపై ఇలాంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


