మానకొండూర్‌కు మినీ స్టేడియం మంజూరు
క్రీడా మంత్రి హామీ
కాకతీయ, కరీంనగర్ : మానకొండూర్ నియోజకవర్గానికి మినీ స్టేడియం ఏర్పాటు చేసే అంశంపై క్రీడలు, యువజన శాఖామంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారని శుక్రవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. పలు అంశాలపై మంత్రితో చర్చించారు. ఎమ్మెల్యే సత్యనారాయణ ఫిషరీస్ రీప్రొడక్టివ్ సెంటర్, సెట్ విన్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు చేయాలని కోరగా, మంత్రి శ్రీహరి సానుకూలంగా స్పందించారు. త్వరలో ఇవి మంజూరు చేయబడుతాయని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయడం, క్రీడా సామాగ్రి సమకూర్చడంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేసి, మంత్రికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.


