కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ శివారులోని జాతీయ రహదారి (ఎన్ హెచ్) బైపాస్ రోడ్డు పనుల వల్ల పంట పొలాలు వరద నీటిలో మునిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. డీబీయల్ కంపెనీ చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం కారణంగా వర్షపు నీరు పొలాల్లోకి చేరుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవడంతో మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినా అమలు కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వరద నీటితో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రోడ్డు పనుల నిర్లక్ష్యంగా వరద ముంపులో పొలాలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


