కాకతీయ, గీసుకొండ: ఊకల సొసైటీ లోని నలుగురు డైరెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా సహకార అధికారి ఆ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల పాలకవర్గాల కరువును పొడిగించగా పాలకవర్గ సభ్యులకు సంఘంలో ఎలాంటి బకాయిలు ఉండకూదని నిబంధన ఉంది.
అయితే ఊకల్ సొసైటీలోని నలుగురు డైరెక్టర్లపై వేటు అని కాకతీయ దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా సహకార సంఘంలో తమ అప్పు బకాయి పడలేదని కొంతమంది తమపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నించారని అందులో భాగంగానే తమపై సస్పెన్షన్ వేటుకు ప్రయత్నించారని, తాము సంఘంలో ఎలాంటి బకాయిలు లేమని, తమని పాలకవర్గం నుంచి తొలగించడం అన్యాయమని డిసిఓ నీరజ దృష్టికి తీసుకువెళ్లారు.

ఆమె సంఘంలో తొలగించబడిన నలుగురి డైరెక్టర్ల అప్పులను పరిశీలించి తమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని సొసైటీ డైరెక్టర్లు మండల వీరస్వామి, మేకల రాజ్ కుమార్,భూక్య నిమ్మ తెలిపారు. ఇదే విషయమై సీఈఓ ఉప్పుల రమేష్ బాబుకి వివరణ కోరగా డిసిఓ నీరజ నలుగురి డైరెక్టర్లపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ,వారి పదవీకాలం తొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.


