లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
కాకతీయ, బయ్యారం : ఆదివాసుల హక్కల కోసం ఈనెల 28న భద్రాచలంలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్మ యుద్ధం విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాచనపల్లి గ్రామంలో తుడుం దెబ్బ జాయింట్ యాక్షన్ కమిటీ మండల నాయకుడు ఆలెం కృష్ణ అధ్యరంలో కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం పోరాడుదామని, ప్రతి ఒక్కరూ తప్పకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొల్లి మల్సూర్, ఆలెం హరీష్ బాబు, ముడిగ వజ్జయ్య, రాజేష్, వెంకన్న, రామ నరసయ్య , పటేల్ సాంబయ్య, దొర బాచాల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


