అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామం గాంధారిఖిల్లా సమీపంలోని చెరువుకు గండి పడిన నేపథ్యంలో మందమర్రి మండల తహసీల్దార్ సతీష్,నీటిపారుదల శాఖ డీఈ శారదతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. వరద నీటి వలన ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం ఉంచాలని ఆదేశించారు.


