రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్ ట్యాపింగ్
కాంగ్రెస్ దూత ఫోన్ ట్యాపింగ్..! గాంధీ భవన్‌లో గుసగుసలు..!
కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్రా చర్చ
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హద్దులు దాటిపోతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఏకంగా కాంగ్రెస్ దూత ఫోన్ ట్యాపింగ్..! గాంధీ భవన్‌లో గుసగుసలు..వినిపిస్తున్నాయి.దీనితో కాంగ్రెస్ శ్రేణుల్లో బయాలు..ఆందోళనలతో సర్వత్రా చర్చ జరుగుతుంది.అరడజను మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన్నారా? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇది. హద్దులు దాటిపోయిందా? అరడజను మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన్నారా? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇది. ముఖ్యనేత ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ విచ్చలవిడి ఫోన్‌ట్యాపింగ్‌తో అధిష్ఠానం కూడా ఆందోళనలో ఉన్నట్టు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరి ఫోన్లు ఎత్తాలన్నా నేతలంతా భయపడుతున్నారట, చివరికి కుటుంబ సభ్యులతోనూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారని వినికిడి. మొత్తంగా ఫోన్‌ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందన్న అనుమానాలు పార్టీని కుదిపేస్తున్నాయి. కేంద్ర మంత్రి ఒకరు ఇటీవల జరిగిన బహిరంగ సమావేశంలో ఫోన్ ట్యా పింగ్ అనుమానాన్ని వ్యక్తంచేయడం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నది


