కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన కోనప్ప
గులాబీ గూటికి చేరుకున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే
ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు స్పందనపై ఆసక్తి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడి… గూలాబీ గూటికి చేరుకున్నారు. ఈమేరకు గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్‌రావుల సమక్షంలో గూలాబీ కండువా కప్పుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతుండగా గురువారం గులాబీలో చేరి హస్తం పార్టీకి షాకిచ్చారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచే కోనప్ప పోటీ చేసిన సంగతి తెలిసిందే. అదే నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి గారు. దీంతో కోనప్ప 3 వేల ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ విజయం సాధించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలవడం వల్లే తన ఓట్లు చీలి ఓడిపోయానని కొనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరడంతో కోనప్ప అలిగి గులబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన తిరుగుబాటు బావుటా ఎగరవేస్తూ వచ్చారు. చివరకు గులాబీ అధిష్ఠానంతో జరిగిన మంతనాల అనంతరం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి


