భావోద్వేగానికి లోనైనా మంత్రి సీతక్క
సోషల్ మీడియాలో వీడియో చెక్కర్లు
మేడారం మాస్టర్ ప్లాన్ పై సీఎంకు కృతజ్ఞతలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : పూజారులు, ఆదివాసి పెద్దలు, అధికారులతో మేడారం అభివృద్ధి ప్రణాళిక పై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో భావోద్వేగానికి లోనైనా మంత్రి సీతక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈనెల 23న ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్కహసారలమ్మల ఆలయ పునరుద్ధరణకై మాస్టర్ ప్లాన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ వన దేవతల గుడిని అభివృద్ధి చేసుకునే భాగ్యం దక్కినందుకు నా జన్మ ధన్యం అయిందననీ ఎమోషనల్ అయ్యారు.సమావేశంలో మాట్లాడుతూ నా జన్మ ధన్యమైందని, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఓడిపోయినా కానీ ఒక్కసారి నాకు సమ్మక్క సారలమ్మల దగ్గర అధికారికంగా సమ్మక్క గుట్ట నుండి తీసుకువచ్చే భాగ్యం కలగాలని కోరుకున్నానని, ఇన్ని సంవత్సరాలు పూజారులు చెట్ల కింద, పుట్ట కింద జాతర నిర్వహించుకుంటూ వచ్చిన భక్తులు సమ్మక్కహసారలమ్మల దయతో ఇక్కడికి వస్తూ ఉన్నారని, ఏళ్ల నుండి భక్తుల విశ్వాసం, నమ్మకాన్ని, పూజారుల ఆచారాలను, ఆదివాసీల ఆచారాలను సాంప్రదాయాలు కొనసాగించేలా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నందుకు నిజంగా ఇంతకంటే మేము ఆ తల్లి బిడ్డలుగా ఏమి కోరుకోవటం లేదని, మా సోదరుడు ముఖ్యమంత్రికి పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.మరో వెయ్యేండ్లు నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సీఎం అభివృద్ధి పరుస్తున్నందుకు వేలవేల వందనాలు అని అన్నారు.


