కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యాతో బంధం కాలపరీక్షలను తట్టుకుంటూ మరింత బలపడిందని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధానగర్ లో మొదలైన ట్రేడ్ షోలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు కూడా మాస్కో భాగస్వామిగా వ్యవహరిస్తుందని తెలిపారు. దేశం స్వయంసమ్రుద్ధిలో ఉత్తరప్రదేశ్ పాత్రను ఆయన కొనియాడారు. భారత్ లో తయారయ్యే మొబైల్ ఫోన్లలో అత్యధికం ఇక్కడి నుంచే వస్తున్నాయని అన్నారు. సెమీకండక్టర్ రంగంలోనూ భారత్ స్వయంసమ్రుద్ధి సాధించాలని పేర్కొన్నారు. భారత్ లోనే చిప్ నుంచి షిప్ వరకు అన్నీ తయారు చేయాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. పన్నుల తగ్గింపు మరింత కొనసాగుతుందని తెలిపారు.
భారత్ లో తయారయ్యే మొబైల్ ఫోన్లలో 55శాతం ఉత్తరప్రదేశ్ నుంచే వస్తున్నాయి. సెమీకండక్టర్ రంగంలో కూడా ఈ రాష్ట్రం బలోపేతం అయ్యింది. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని మన దళాలు భావిస్తున్నాయన్నారు. మనం బలమైన రక్షణ రంగాన్ని అభివ్రుద్ధి చేసుకుంటున్నాము. రష్యా సాయంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఏకే 203 రైఫిల్స్ ఉత్పత్తి మొదలుపెడతాము. యూపీలో డిఫెన్స్ కారిడార్ ను నిర్మిస్తున్నారని తెలిపారు.
జీఎస్టీలో మార్పులు నిర్మాణాత్మక సంస్కరణలు..అవి భారత వ్రుద్ధికి రెక్కలు తొడగుతాయి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ మరింత సరళంగా మారింది. పన్ను వివాదాలు చాలా తగ్గాయి. ఎంఎస్ఎంఈలకు వేగంగా రీఫండ్స్ లభిస్తున్నాయి. 2014 ముందు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను దాచిపెట్టేందుకు ..దాని మిత్రులు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు. మేము ప్రజల ఆదాయం, పొదుపు పెంచాము. ఇక్కడితోనే ఆగిపోము. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడాన్ని మరింత కొనసాగిస్తాము. భవిష్యత్తులో కూడా పన్నులు తగ్గిస్తాము. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


