కాకతీయ, సినిమా డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు ఆమె ఫ్యాషన్ స్టైల్ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఒక ఫోటో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చేతికి ధరించి లగ్జరీ వాచ్ పై నెటిజన్ల కన్ను పడింది. ఈ మధ్య సినిమాల కంటే బ్రాండ్ ప్రమోషన్లతో ఎక్కువగా హెడ్లైన్స్‌లో కనిపిస్తున్న సమంత, తాజాగా ఒక కొత్త వాచ్‌తో ఆకట్టుకుంది. ఫొటోలలో కనిపించిన ఆ ట్రెండీ వాచ్ ఏ కంపెనీది? దాని ధర ఎంత? అని నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అసలు ఆ వాచ్ పియాజెట్ 60 జువెలరీ ఎడిషన్‌గా తెలుస్తోంది. ప్రత్యేకమైన ట్రాపేజ్డ్ ఆకారంలో ఉండే ఈ లగ్జరీ వాచ్ ధర సుమారు రూ. 30 లక్షలకు పైగానే ఉంటుందట.
సమంత ఇంతకు ముందు కూడా బల్గారీ సర్పెంటీ వాచ్ ధరించి అనేక సార్లు కనిపించింది. ఆ వాచ్ ధర మాత్రం రూ. 45 లక్షలకు పైగా అని తెలుస్తోంది. లగ్జరీ వాచెస్ అంటే సామ్‌కి ఎంత ఇష్టం ఉందో ఈ విషయాల ద్వారానే అర్థమవుతోంది. ఫ్యాషన్‌లో ఎప్పుడూ యూనిక్‌గా ఉండాలని చూసే సమంత, ఒక్కోసారి తన యాక్సెసరీస్ ద్వారానే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మా ఇంటి బంగారం” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతుండగా, సమంత కీలకమైన పాత్రలో కనిపించనుంది. అలాగే రాజ్ & డీకే క్రియేట్ చేస్తున్న వెబ్ సిరీస్ “రక్త బ్రహ్మాండ” లోనూ సమంత నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం సమంత ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక పర్సనల్ లైఫ్ విషయంలో కూడా సమంత తరచూ వార్తల్లోకి వస్తోంది. తాజాగా ఆమె, నటుడు రాజ్‌ను ముంబైలోని ఒక జిమ్ దగ్గర కలిసి స్పాట్ చేయడంతో కొత్త గాసిప్స్ తెరపైకి వచ్చాయి. ఒకే కారు ఎక్కి వెళ్లిపోవడం, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. చాలా మంది అయితే, త్వరలోనే పెళ్లి జరగొచ్చని కూడా అంటున్నారు. అయితే ఈ రూమర్స్‌పై సమంత కానీ, రాజ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
మొత్తానికి.. సినిమాలు, బ్రాండ్లు, లగ్జరీ లైఫ్‌స్టైల్, పర్సనల్ లైఫ్ అన్నీ కలిపి సమంత ఎప్పుడూ న్యూస్‌లోనే ఉంటుంది. తాజాగా ఆమె ధరించిన ఈ పియాజెట్ వాచ్‌తో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్‌గా మారింది.


