కాకతీయ, కరీంనగర్ : చొక్కారావుపల్లి – ఖాజీపూర్ గ్రామాల మధ్య మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కేంద్ర నిధులు మంజూరయ్యేలా కృషి చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ఘనంగా సన్మానించారు. కరీంనగర్‌లోని మంత్రి నివాసంలో ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్‌కు శాలువా కప్పి సన్మానించి, నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపారు.
కవ్వంపల్లి మాట్లాడుతూ.. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చేసిన బండి సంజయ్ కృషి శ్లాఘనీయమని అన్నారు. ఏళ్ల నాటి వంతెన కల త్వరలో సాకారం కాబోతోందని, ఆ ప్రాంత ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.


