కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. పట్టణంలో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న కొమురవెల్లి సంతోష్ తన కారును ఇంటి ముందు పార్క్ చేసి ఉంచాడు.
ఉదయం స్టార్ట్ చేయగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజిన్ నుంచి పొగలు రావడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు మొత్తం మంటల్లో చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.


