కాకతీయ, గీసుగొండ: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే పరకాల ఇందిరా మహిళ డైరీ ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యక్తం చేశారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్ల మహాలక్ష్మి గార్డెన్స్ లో ఝాన్సీ రాణి పట్టణ పరస్పర సహాయ సహకార సమైక్య లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మేయర్ గుండు సుధారాణి తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.
అంతకుముందు మహిళలు బతుకమ్మ,కోలాటాలతో వారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారనీ అన్నారు.15,16,17వ డివిజన్ల పరిధిలో స్వయం ఉపాధికి అవకాశాలకు సంకల్పించడం సంతోషదాయకంగా ఉందన్నారు.
మహిళా సంఘాల ఏర్పాటు అనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే ఏర్పడిందని, అప్పటినుండి మహిళా సంఘాలు ఆర్థిక రంగంలోనే కాకుండా సామాజిక రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు. దేశ స్థితిగతులను మార్చే శక్తి మహిళా సంఘాల దేనిని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదని,ప్రజా ప్రభుత్వ లక్ష్యం కోట్లాది మహిళలను ఆర్థికంగా బలపరచడమే అని అన్నారు.
సమాజంలో సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి మహిళా సంఘాలు ఎంతగానో దోహదం చేశాయని ముక్తకంఠంతో అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య,టీఎంసీ రమేష్,సిఈఓ రజిత,సమాఖ్య అధ్యక్షురాలు మమత, మహిళా సంఘాల లీడర్లు,సభ్యురాల్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


