కాకతీయ, నేషనల్ డెస్క్: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగం వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశ అధ్యక్షుడు ఓం శాంతి ఓం, నమో బుద్ధాయ అనడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రపంచం మొత్తం కూడా భయం, ఆందోళన, హింసతో నిండిపోయిందని..బెదిరింపులు, ఉగ్రవాదం నుంచి విముక్తి పొందాలని సందేశం ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రబోవో తన ప్రసంగాన్ని ఓం శాంతి ఓం తో ముగించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్య ప్రధాన చర్చాంశంగా నిలిచింది. గాజాలోని యుద్ధం, పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చించగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ప్రబోవో మాట్లాడుతూ.. ప్రపంచం.. భయం, జాత్యహంకారం, ద్వేషం, అణచివేత, వర్ణ వివక్ష వంటి మానవ మూర్ఖత్వ కారణాలతో నడుస్తున్నందున భవిష్యత్తు కోసం మనం సైతం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. గాజాలో శాంతి కొనసాగింపుకు ఇండోనేషియా 20,000 మంది సైనికులను మోహరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు రెండు దేశాల పరిష్కారం కోసం పిలుపునిచ్చారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండూ స్వతంత్రంగా సురక్షితంగా ఉండాలని, బెదిరింపులు, ఉగ్రవాదం నుండి విముక్తి పొందాలని నొక్కి చెప్పారు. “ఏ రాజకీయ సంఘర్షణకైనా హింస సమాధానం కాదు, ఎందుకంటే హింస మరింత హింసను మాత్రమే పెంచుతుంది అని సుబియాంటో అన్నారు.
VIDEO | New York: Indonesian President Prabowo Subianto concluded his speech at the UN by saying, “Wassalamu’alaikum warahmatullahi wabarakatuh, Shalom, Om Shanti Shanti Shanti Om. Namo Budhaya. Thank you very much.”#UNGA80
(Source: Third Party)
(Full video available on PTI… pic.twitter.com/LiNTWX70O3
— Press Trust of India (@PTI_News) September 24, 2025
ప్రబోవో సుబియాంటో తన 19 నిమిషాల ప్రసంగాన్ని “ఓం శాంతి శాంతి శాంతి ఓం”, “నమో బుద్ధాయ”, “షాలోమ్” తో ముగించారు. ఆయన ప్రధానంగా సామరస్య, శాంతి, సమాన అవకాశాల కోసం ప్రపంచాన్ని పిలుపునిచ్చారు. ప్రబోవో తన దేశం ఇండోనేషియాను ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం అని, 28 కోట్లకు పైగా జనాభాలో దాదాపు 90శాతం మంది ఇస్లాంను అనుసరిస్తున్నారని చెప్పారు.


