కాకతీయ, సినిమా డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత కూడా ఆమె కెరీర్‌లో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బ్రాండ్ విలువ, క్రేజ్ అంతే ఉంచుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్తున్నారు.
ఇక తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం గురించే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో స్నేహం కాస్తా ప్రేమగా మారిందని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తున్నారని, సీక్రెట్‌గా కలుస్తున్నారని గత కొన్ని రోజులుగా గాసిప్స్ వెలువడుతున్నాయి.
View this post on Instagram
ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చేలా ఇటీవల ఓ వీడియో వైరల్ అవుతోంది. సమంత, రాజ్ ఇద్దరూ కలిసి జిమ్‌కి వెళ్ళి, అనంతరం ఒకే కారులో బయలుదేరిన దృశ్యం కెమెరాల్లో చిక్కింది. దీంతో వీళ్లిద్దరి రిలేషన్‌పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో అయితే.. “ఇద్దరూ నిజంగానే రిలేషన్‌లో ఉన్నారా?”, “త్వరలోనే పెళ్లి చేసుకుంటారా?” అన్న చర్చలు హోరెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు సమంత గాని, రాజ్ నిడిమోరు గాని ఈ విషయంపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు.


