గాయత్రి దేవి అలంకరణలో భద్రకాళి అమ్మవారు
కాకతీయ, వరంగల్ : శ్రీ భద్రకాళీదేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవములలో భాగంగా బుధవారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమించారు. ఉదయం సింహ వాహనసేవ, సాయంత్రం గజవాహనసేవ నిర్వహించనున్నట్లు భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. దేవస్థానానికి గాయత్రి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి బారులు తీరారు.


