కాకతీయ, ఇనుగుర్తి: కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి టౌన్ అధ్యక్షుడు గంజి రాజేందర్ రెడ్డి మాతృమూర్తి మాజీ ఎంపిటిసి గంజి కళావతి మృతి చెందడంతో మంగళవారం అతడిని పలువురు నాయకులు పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కూరెల్లి సతీష్, ఇతర నాయకులు ఆ కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బైరు అశోక్ గౌడ్, చిన్నాల కట్టయ్య, మాజీ ఎంపిటిసి తమ్ముడ పెళ్లి రజిని కుమార్, కాలేరు శివాజీ, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు దేవులపల్లి వెంకన్న, కార్యదర్శి వల్లముల మురళి, మార్కెట్ డైరెక్టర్ కొట్టం రాము, కొట్ట మహేందర్, యాదగిరి, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, వీరన్న నారాయణ, రాములు, అజయ్, రవీందర్ రెడ్డి, సదానందం, యకాన్న, రాజు వెంకన్న, సుధాకర్, సందీప్, రాములు తదితరులు పాల్గొన్నారు.


