- హన్మకొండ జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య
కాకతీయ, వరంగల్ : ప్రజలు అత్యవసర వైద్య సేవల నిమిత్తం 108 అంబులెన్స్, గర్భిణీ సమయంలో, ప్రసవానంతరం, శిశువుల సేవల నిమిత్తం 102 వాహనాలను వినియోగించుకోవాలని హన్మకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య సూచించారు .మంగళవారం డిఎం అండ్ హెచ్ఓ ఛాంబర్ లో ఆయన 108, 102 అందిస్తున్న సేవలను సమీక్షించారు.
జిల్లాలో (17)108, (7)102 వాహనములు సేవలు అందిస్తున్నాయని, అయితే అయినవోలు ,నడి కూడ, ఆత్మకూర్, ధర్మసాగర్, ముల్కనూర్, పరకాల దామెర, వేలేరు లలో సగటు వినియోగం చూసినట్లయితే తక్కువగా ఉందన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో 108 సిబ్బంది సమన్వయంతో ఉంటూ శిక్షణ పొందిన, నిపుణులైన సిబ్బంది కలిగి ఉన్న 108 సేవలను ప్రజలు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ సమీక్షలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ మంజుల, డాక్టర్ ఇక్తదార్ అహ్మద్, ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, డెమో వి.అశోక్ రెడ్డి, హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ ఎం శ్రీనివాస్, వరంగల్ కోఆర్డినేటర్ భరత్ కుమార్ పాల్గొన్నారు.


