- టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ జక్కుల విజయ్ కుమార్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) పేరు చెప్పుకొని వరంగల్ శివనగర్ లోని సాయి కన్వెన్షన్ హాల్లో కొంతమంది విలేకర్లు పెట్టుకున్న సమావేశానికి టిడబ్ల్యూజేఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్, కార్యదర్శి బొట్ల స్వామిదాస్ లు తెలిపారు.
ఈసందర్బంగా అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 22 సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అంటూ కొంత మంది విలేకరులు సమావేశం ఏర్పాటు చేసుకొని మరో కమిటీ అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవాలు లేదని జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు గమనించగలరని అన్నారు. కమిటీ అట్టి ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య ,రాష్ర్ట నాయకుల సమక్షంలో 5 జులై 2025 రోజునే వరంగల్ జిల్లా మహాసభలు పూర్తిచేసుకుని పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకున్నారని గుర్తు చేశారు.
అధికారిక యూనియన్ తో సంబంధం లేని వ్యక్తులు, వేర్పాటు వాదులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ గతంలో సంఘ సభ్యులుగా ఉండి ఎటువంటి కార్యాచరణ చేపట్టకపోవడం, మహసభలకు కూడ హాజరు కాకుండా ఇప్పుడు కమిటీని ఎన్నుకున్నాం అంటూ తప్పుడు ప్రచారాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు జక్కుల విజయ్ కుమార్, కార్యదర్శి బొట్ల స్వామిదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ పాలడుగుల సురేందర్, జాతీయ కౌన్సిల్ మెంబర్ బి. మల్లేష్ ,ఉపాధ్యక్షుడు వెల్ది రాజేందర్, సంయుక్త కార్యదర్శి భావాండ్ల పెళ్లి కిరణ్ కుమార్, శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పెండెల శ్రీనివాస్, చంద్ర , యూనియన్ సభ్యులు పాల్గోన్నారు.


