- మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున్
- 8 షాపులకు రూ.51 వేల జరిమానా
కాకతీయ, హుస్నాబాద్ : నాణ్యతాప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున్ హెచ్చరించారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని పలు హోటల్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, సింగిల్ యూస్ ప్లాస్టిక్, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించని 8 షాపులకు రూ.51 వేలు జరిమానా విధించారు. ఇందులో దావత్ రెస్టారెంట్ కు అధికంగా రూ.20వేలు విధించగా బావర్చి రెస్టారెంట్, రాజు గారి బిర్యానీ షాపులకు రూ.10వేల చొప్పున జరిమానా విధించారు.
మస్తీ కిచెన్ కు రూ.5వేలు, స్వాగతి రెస్టారెంట్, రిషి బిరియానీలకు రూ. 10 వేలచొప్పున జరిమానా విధించగా, మైసూర్ బేకరీ, వీనస్ మెస్ లకు రూ. 1000 చొప్పున జరిమానా విధించి నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ తనిఖీలలో పర్యావరణ అధికారి రవికుమార్, ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, బిల్ కలెక్టర్ సతీష్, జవాన్లు సారయ్య, ప్రభాకర్, మునిసిపల్ సిబ్బంది శేఖర్, వనకర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


