కాకతీయ, రామకృష్ణాపూర్ : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా బ్యాంక్ లింకేజీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 25 సంఘాలకు రూ.2 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ దుర్గం మనోహర్ తో కలిసి అందించారు.
అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆనుకోని ఆరు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 567 మహిళ సమాఖ్య సంఘాల మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మెప్మా విభాగ ప్రతినిధుల పనితీరును మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో మందమర్రి తహసిల్దార్ సతీష్, పుర కమిషనర్ గద్దె రాజు, డీఈ సుమతి, ఏఈ ఆశ్రిత్, ఆర్ఐ సతీష్, మెప్మా టిఎంసి శ్రీధర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పిన్నింటి రఘునాథ్ రెడ్డి, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యా సాగర్, మహిళ ఆర్.పిలు పాల్గొన్నారు.


