కాకతీయ, నల్లబెల్లి: జీఎస్టీ తగ్గింపుతో సామాన్య ప్రజలపై ఉన్న పన్ను భారము తేలిక పడి, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
“భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకున్న చారిత్రక నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించింది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, బ్యూటీ మరియు ఫిజికల్ సర్వీసులు, ఇంటి నిర్మాణ ఖర్చులు, ఆటోమొబైల్స్ వంటి అవసరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గింపు అమలులోకి వస్తుంది. ఇది నిజంగా ప్రజల దైనందిన జీవితంలో మార్పు తీసుకురానుంది,” అని ఆయన అన్నారు.
వినయ్ గౌడ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు ఇది ఒక గిఫ్ట్ లాంటిది. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, పేదల సంక్షేమం పట్ల మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిబద్ధతకు నిదర్శనం. దసరా & బతుకమ్మ పండుగలకు ముందే మోదీ నుంచి పేదలకు గొప్ప కానుక ఇది,” అని పేర్కొన్నారు.
“పేద కుటుంబాలు కూడా పండుగ సందర్భాలలో సంతోషంగా కొనుగోలు చేయగలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి రోజువారీ ఖర్చులు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్, సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు, నాగిరెడ్డి రాజిరెడ్డి, మండల నాయకులు మురికి మనోహర్, ములుక రాజేష్, ఓదెల అశోక్, నాగపూరి సాగర్, గుగులోతు రాందాన్, అశోక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


