కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: జిల్లా ప్రధాన ఆస్పత్రిలో జరిగిన సంఘటన సందర్భంగా, జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రత్యేక చొరవ తీసుకొని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్ ను ఆసుపత్రికి పంపి, వైద్యులు నిరసన కార్యక్రమం పై జూనియర్ డాక్టర్లు బాధిత కుటుంబాలతో మాట్లాడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని సమీక్షించారు.
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలకు వైద్యం అందించడంలో ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి ఆసుపత్రి వద్ద ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయనైనదని తెలిపారు . పూర్తిస్థాయిలో పరిస్థితి అదుపులో ఉందన్నారు. ఎవరు ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని అదనపు కలెక్టర్ సూచించారు.


