కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: దసరా పండుగను పురస్కరించుకొని, మహబూబాబాద్ పట్టణంలోని నూతనంగా 99 కిడ్స్ వస్త్ర దుకాణ యజమాని చిన్నపిల్లలకు క్రేజీ ఆఫర్స్ అంటూ ప్రచారం చేస్తు హడావుడి చేశారు. మంగళవారం నూతన షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా 5 రూపాయలకు చిన్నపిల్లలకు రెండు టీ షర్ట్స్ ,అంటు 9 రూపాయల నుండి 99 రూపాయలకే మీకు కావలసిన డ్రెస్సులు కొనుగోలు చేయవచ్చు అంటూ ఆ షాప్ యజమాని క్రేజీ ఆఫర్స్ ప్రకటించారు.
సింగపూర్ గర్ల్స్ టీషర్ట్స్, రూపాయలు(69)అలాగే(99) రూపాయలకి మిడ్డీ, హ్యాపీ బుమర్స్ 99కి (4)అనడంతో అ వస్త్ర దుకాణానికి జనాలు పోటెత్తారు. మహిళలు చిన్నపిల్లల్ని వెంట పెట్టుకొని ,భుజాల పై ఎత్తుకుటూ ఆఫర్స్ కలిగిన దుస్తులను దక్కించుకోవడం కోసం జనం నానా అవస్థ లు పడినారు. ఆ షాప్ ముందు పెద్ద ఎత్తున మహిళలు గుమ్మి గుడారు. దీంతో బ్యాచ్ కి 40 మంది చొప్పున విభజించి వారి షాపింగ్ పూర్తయిన తర్వాత నే మరో 40 మందినీ అ వస్త్ర దుకాణ యాజమాన్యంలోనికి అనుమతించారు.


