కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏక నామస్మరణ నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వేద మంత్రోచ్ఛరణలతో స్వామివారికి అభిషేకం అర్చనలు నిర్వహించి, మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
స్వామివారి మండల దీక్షలు చేపట్టిన స్వాములు “ఓం నమో సుబ్రహ్మణ్యం”అంటూ ఏక నామస్మరణ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీక్షలు చేపట్టిన స్వాములు 24 గంటలు స్వామివారినీ ఒకే నామంతో స్మరించడం ఏక నామం యొక్క విశేషం.ఈ సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష ఆలయ కమిటీ, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


