కాకతీయ, బిజినెస్ డెస్క్: దేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు పెరుగుతున్న కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీనివల్ల డిమాండ్ గణనీయంగా పెరిగి, ధరలు ఎగబాకుతున్నాయి. అంతేకాకుండా, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం కూడా పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 23న బంగారం రేట్లను పరిశీలిస్తే, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1,13,080కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,03,660గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,13,230 పలుకుతుండగా, 22 క్యారెట్ల రేటు రూ.1,03,810గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
వెండి రేట్లూ పెరుగుతూ ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే కిలోకు మరో వంద రూపాయలు పెరిగాయి. దీంతో పసిడి మాత్రమే కాకుండా వెండి మార్కెట్ కూడా వినియోగదారులకు భారంగా మారింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ధరలు ఇంకా ఎటువంటి మార్పులు చూపుతాయో అన్న ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్‌లో రూ. 1, 13, 080, రూ. 1, 03, 660
విజయవాడలో రూ. 1, 13, 080, రూ. 1, 03, 660
ఢిల్లీలో రూ. 1, 13, 230, రూ. 1, 03, 810
ముంబైలో రూ. 1, 13, 080, రూ. 1, 03, 660


