- బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : జీఎస్టీ పన్నుల తగ్గింపు నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బజాజ్ షోరూం వద్ద బిజెపి పట్టణ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఉపయోగించే 80% వస్తువులపై టాక్స్ తగ్గించడం ఇదే తొలిసారని అన్నారు. జీఎస్టీని మూడు అంచెల సరళ విధానంగా మార్చి, నిత్యావసరాలకు 5%, సాధారణ వస్తువులకు 18%, విలాసవస్తువులకు 40%గా అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో నవరాత్రుల వేళ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయన్నారు.
విదేశీ వస్తువుల వినియోగం తగ్గించి ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని సూచించారు. మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ దిశగా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, ఈదులకంటి రవీందర్ రెడ్డి, గంగిశెట్టి ప్రభాకర్, గంగిశెట్టి రాజు, పైళ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


