కాకతీయ, కరీంనగర్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ వారియర్స్‌తో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీసీఏస్‌బి హైదరాబాద్ పంపిన టీ-షర్టులను సైబర్ వారియర్స్‌కు అందజేశారు. అనంతరం సమావేశంలో సీపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నందున ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని సూచించారు.
అలాగే, తమకు అప్పగించిన బాధ్యతను నిర్లక్ష్యం లేకుండా నిర్వర్తిస్తూ, సైబర్ కేసుల ఇన్వెస్టిగేషన్‌లో బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలని ఆదేశించారు. తాజాగా సెప్టెంబర్ 13న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రామగుండం కమిషనరేట్ పరిధిలోని 134 సైబర్ కేసుల్లో మొత్తం రూ.41,81,824/- రూపాయలు బాధితుల ఖాతాల్లోకి రిఫండ్ అయ్యాయని సీపీ సీపీ తెలిపారు.
ఈ క్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు సైబర్ వారియర్ కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు సీపీ అందజేశారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్. శ్రీనివాస్, సీసీపీఏస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సీసీ హరీష్, సైబర్ వారియర్స్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


