కాకతీయ , కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చలిగంటి సురేష్ సోమవారం విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లైట్లు వేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయకపోవడంతో ప్రమాదం జరిగింది.
షాక్ తగిలి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల సహాయంతో పంచాయతీ కార్యదర్శి నరసయ్య అతన్ని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


