కాకతీయ, తెలంగాణ బ్యూరో: మహారాజా శ్రీ అగ్రసేన్ జయంతి 5149వ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాజా శ్రీ అగ్రసేన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజహితానికి, సమానత్వానికి కష్టపడిన మహారాజా అగ్రసేన్ ఆలోచనలను స్మరించుకుంటూ, సామాజిక న్యాయం, సహజీవన సౌహార్ద్రం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
అగ్రసేన్ మహారాజు చూపిన మార్గం దేశ అభివృద్ధి, సౌభ్రాతృత్వం, మనస్పూర్తి సమానత్వానికి మార్గదర్శకం అని డిప్యూటీ సీఎం అన్నారు.
మహారాజా శ్రీ అగ్రసేన్ జయంతి 5149వ వేడుకలు.. పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


