కాకతీయ, గీసుకొండ: తండాలను టార్గెట్ చేస్తూ దొంగలు బీభత్సం సృష్టించారు. సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని విశ్వనాధపురం గ్రామం, సింగ్య తండాలలో నిన్న రాత్రి గుర్తుతెలియని దొంగలు రెండు గ్రామాల్లో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు.బాదావత్ దేవ్ సింగ్,వాంకుడోతు రవీందర్, అక్కినేపల్లి ప్రదీప్, భూక్య బిక్షపతి ఇళ్లలోకి దొంగలు చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, అలాగే నగదు దోచుకెళ్లినట్లు సమాచారం.
మొత్తం విలువ రూ.1,69,690/- గా అంచనా వేయబడింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. సంఘటన స్థలానికి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూర్ ఏసిపి వెంకటేశ్వర్లు చేరుకొని దొంగతనం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఊరికి వెళ్లే వారు బంగారం, వెండి ఆభరణాలను బ్యాంకుల్లో లేదా ఇతర భద్ర ప్రదేశాల్లో ఉంచుకోవాలని, ఊరికి వెళ్లే విషయాన్ని పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు తెలియజే యాలని విజ్ఞప్తి చేశారు.


