కాకతీయ, గీసుగొండ : ధర్మారంలోని శ్రీ రామకృష్ణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. 15 సంవత్సరాలుగా విద్యా బోధనలో విశిష్ట సేవలందిస్తున్న ఇల్లందుల శ్రీకాంత్, పోలేపాక ప్రణయ్, నడికట్టు శ్వేతలకు తెలంగాణ రాష్ట్ర స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ కరీమాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి చేతుల మీదుగా ఉపాధ్యాయులు అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు నాగర్జున రెడ్డి,బాలవారి సుధీర్ తదితరులు ఉపాధ్యాయులను అభినందించారు. శ్రీ రామకృష్ణ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ మలిశెట్టి ముత్యావరావు, సహా ఉపాధ్యాయులు వారిని అభినందించారు.


