కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ గ్రామంలో ఓ రైతు పత్తి చేనులో అడవి పిల్లులు తరచూ వస్తూ పంట నష్టం చేస్తున్నాయి. పత్తికాయలను తొలుస్తూ నష్టం చేస్తుండటంతో సమస్య పరిష్కారానికి అదే గ్రామానికి చెందిన వేటగాడిని ఆశ్రయించాడు. సదరు వేటగాడు చేనులో శనివారం బోను అమర్చి ఎప్పటిలానే వెళ్లాడు.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున బోను అమర్చిన ప్రదేశం వద్దకు వెళ్ళి చూడగా మొసలిని చూసి ఒక్కసారిగా అవక్కాయ్యాడు. దీంతో ఈనోటా ఆనోటా మొసలి చిక్కిందని ప్రచారం జరిగింది. విషయం తెలుసున్న గ్రామస్తులు పోలీస్ లకు సమాచారం ఇవ్వగా అటవీ శాఖ అధికారులు బోను ద్వారా సురక్షితంగా మొసలిని అడివి లో నీటి ప్రాంతంలో వదిలేయడంతో కథ సుఖాంతమైంది.


